నేను సౌజన్య కలిసి అప్పుడే పది సంవత్సరాలు అయిపోయాయి అంటే నమ్మలేనట్టు గా వుంది. కాలం చాల వేగంగా పరిగెడుతుంది. పది సంవత్సరాల క్రితం మా ఇద్దరికీ తెలియదు మేము జీవితాన్ని పంచుకోబోతున్నాము అని. సరదాగా మొదలయిన మా పరిచయం ప్రేమ గా మారి పెళ్లి కి దారి తీస్తుంది అని ఆ రోజు తెలియదు. ఇన్ని సంవత్సరాల తరువాత 10 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆ తీపి గుర్తులు ఇంకా కొత్త గా వున్నాట్టు, మొన్ననే సౌజన్య తో పరిచయం అయినట్టు అనిపిస్తుంది.
ఈ పది సంవత్సరాలలో అక్షయ పుట్టి మా జీవితాల అర్ధాన్ని మార్చి పరమార్ధాన్ని తెలిపింది. ఎన్నో కష్టాలు మరెన్నో ఆనందాలు కలిపితేనే జీవితం.
ఆ కష్టాల నుండి పాఠాలు, ఆనందాల అనుభూతులుతో, ఈ జీవితం మరింత ప్రేమమృతాలు పంచుతూ ఇట్లా సాగిపోవాలని ........ యశ్వంత్